ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్


Wed,September 19, 2018 02:47 AM

వినాయక్‌నగర్ : విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇ చ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వరాలజల్లు కురిపిస్తున్నది. అందులో భాగంగా విద్యుత్తు శాఖలో పనిచేస్తు న్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 23వేల మంది క్రమబద్ధీకరించడానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని సవా ల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టేసింది. గతేడాది ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ నా లుగు విద్యుత్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. రెగ్యులరైజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొంత మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎట్టకేలకు హైకోర్టు అన్ని పరిశీలించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రమాదపు అంచులో ప్రతి దినం వి ధులు నిర్వహిస్తూ, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి సర్వీసులు క్రమబద్ధీకరించకపోవడంతో కలుగుతున్న ఇబ్బందులును కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం కష్టపడుతున్న వారందరికీ క్రమబద్ధీకరణ చే యాలనే ఉద్దేశంతో మంచి జీవన ప్రమాణాలతో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో జిల్లా వ్యా ప్తంగా ట్రాన్స్‌కోలో 386 మంది, ఎన్‌పీడీసీఎల్‌లో 1,156 మందికి లబ్ధి చేకూరనున్నది. నిరుపేదలైనా ఎంతో కష్టంతో ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారందరినీ క్రమబద్ధీకరించడంతో వారి కుటుంబాల్లో వెలుగులు నిండాయి.

185
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...