ఉద్యోగుల సంబురాలు


Wed,September 19, 2018 02:47 AM

వినాయక్‌నగర్ : విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం నగరంలోని విద్యుత్ ప్రగతి భవన్ ఎదుట ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్తు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు తిరుపతి మాట్లడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 23వేల మంది క్రమబద్దీకరించడానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ ఉద్యోగులను గుర్తించి క్రమబద్దీకరించారని వారికి విద్యుత్ శాఖ సీఎండీ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రామకృష్ణ, బాల్‌రాజు, సంతోష్‌నాయక్, రామరావు, శ్రీపథ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...