ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు


Wed,September 19, 2018 02:47 AM

నిజామాబాద్ సిటీ: ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వం లో సంక్షేమ ఫలాలు అందాయని, ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ పార్టీకి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని నిజామాబాద్ అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. మంగళవారం ఆయ న నగరంలోని 42వ డివిజన్‌లో వందలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్ర చేశారు. తొలుత నాందేవ్‌వాడలోని ఛత్రపతి హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఆ డివిజన్‌లో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ తాను స్వయంగా రూపొందించిన క్లాత్ బ్యాగులను అందించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. ప్లాస్టిక్‌తో జరిగే అనర్ధాన్ని వివరిస్తూ తన పాదయాత్రలో నగర ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మరోమారు అర్బన్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కో రారు. ఈ సందర్బంగా తాను ప్రత్యేకంగా తయారు చేయించిన బుక్‌లెట్లను ఇంటింటికీ క్లాత్ బ్యా గుతో సహా పంపిణీ చేశారు.

అందులో అర్బన్ ఎమ్మెల్యేగా తాను నగరాభివృద్ధికి చేసిన కృషిని వివరిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న నగర సుందరీకరణ పనులు, స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దే క్ర మంలో తనకున్న విజన్‌ను ఆ పుస్తకంలో నమూనాలతో సహా పొందుపర్చారు. ఇప్పటి వరకు నగరాభివృద్ధికి తెచ్చిన నిధులు, చేపట్టిన కార్యక్రమా ల గురించి వివరించారు. ప్రచారంలో భాగంగా దర్జీగా మారిన బిగాల కుట్టు మిషన్ పై దుస్తులను కుట్టారు. ఇస్త్రీ చేసి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ..ఎంపీ కవిత సహకారంతో నిజామాబాద్ నగరాభివృద్ధికి కృషిచేసినట్లు తెలిపారు. నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చాలా పనులు మొదలుపెట్టామని, కొన్ని పనులు కొనసాగుతున్నాయ ని, మారోమారు అవకాశమిస్తే తన విజన్ మేరకు వీటిని పూర్తి చేసి రాష్ట్రంలోనే నంబర్‌వన్ సిటీగా ఇందూరును తీర్చిదిద్దుతానని తెలిపారు. పాదయాత్రలో భాగంగా డివిజన్ల వారీగా తాను ప్రజలను కలుసుకుంటున్న సందర్భంలో విశేష స్పం దన లభిస్తున్నదని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డ గా సాదరంగా ఆహ్వానించి సంతోషంతో మాట్లాడుతున్నారని, ప్రతి గడపకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు అందిన సంతృప్తిని ప్రతి ఒ క్కరి కళ్లలో చూస్తున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ ధాత్రిక రేవతి పరమేశ్, నాయకులు సుజిత్‌సింగ్ ఠాగూర్, సత్యప్రకాశ్, విజయలక్ష్మి, ప్రవీణ్ గౌడ్, బంగారు నవనీత, బంగారు సాయిలు, మాధాని శ్రీధర్, హైమద్, కాలనీవాసులు పాల్గొన్నారు.

177
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...