కంటి వెలుగుకు బారులు తీరుతున్న జనం


Wed,September 19, 2018 02:47 AM

ఖలీల్‌వాడీ : కంటి వెలుగుకు జిల్లాలో విశేష స్పందన ల భిస్తోంది. మంగళవారం నిర్వహించిన కంటి పరీక్షల కోసం జనం బారులు తీరారు. కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ కు జిల్లాలో మొత్తం 35 బృందాలు పని చేస్తున్నాయి. ఒ క్కరు కూడా తప్పిపోకుండా అందరికీ కంటి పరీక్షలు చేస్తు న్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,28,178 మంది కి స్క్రీనింగ్ నిర్వహించగా అందులో 9,522 మందికి మో తి బిందు సమస్య ఉన్నట్లు గుర్తించారు. వారికి త్వరలో ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని చెప్పి చీటీ కూడా రాసి ఇచ్చారు. మోతిబిందు, క్లాపికేటెడ్ కాటారాక్ట్ లేకాకుండా పలు మైనర్, మేజర్ కంటి ఆపరేషన్ల కేసులను ఈ శిబిరాల్లో గుర్తిస్తూ వారికి ఆపరేషన్లు త్వరలో చేయనున్నారు. ఇప్పటి వరకు గుర్తించి వారికి సీరియర్ వారీగా ఆపరేషన్లు జిల్లా కేం ద్రంలో నిర్వహిస్తున్నారు. అర్బన్‌లోని ఏడు కేంద్రాల్లో 29,970 మందికి స్క్రీనింగ్ పూర్తి కాగా, 11,585 మందికి కంటి అద్దాలను ఇచ్చారు. ప్రిస్క్రిప్షన్ కంటి అద్దాలు 6,845 ఇవ్వాలని గుర్తించారు. 2,629 మందికి కాటారాక్ట్ ఆపరే షన్ అవసరమని వైద్యులు గుర్తించారు.

జిల్లా వ్యాప్తంగా 1,28,178 మందికి కంటివెలుగు
జిల్లాలో మంగళవారం 1,28,178 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇప్పటి వరకు నేరుగా 31,455 మందికి కంటి అద్దాలు ఇవ్వగా పరీక్షల అనంతరం అవసర మైన ప్రిస్క్రిప్షన్ అద్దాలు 31,134 అవసరమని గుర్తించి వాటి కోసం ఆర్డర్ పెట్టారు. మొత్తం 9,522 మందికి మోతి బిందు ఆపరేషన్లు చేయాల్సిందిగా పరీక్షల్లో తేల్చారు. వీటితో పాటు కాంప్లికేటెడ్ కాటారక్ట్ 167, కార్నియా 689 మందికి, టెరీజియం 2,971 మందికి, సస్పెక్టెడ్ ఆమ్లోపి యా 81 మందికి, గ్లూకోమా 76, స్వింట్ 446, పోస్టీరి యల్ సెగ్మెంట్ న్యూడ్ ఎవల్యూషన్ 1056 మందికి ఉన్న ట్లు గుర్తించారు. ఈ కంటివెలుగు శిబిరాల్లో గుర్తించి ని ర్ధారించిన ఆపరేషన్లు అవసరమున్న వారికి వెంటే ఆపరేష న్లు చేస్తున్నారు. ఆపరేషన్లు అవసరమని గుర్తించిన వైద్యారో గ్యశాఖ గత సోమవారం 10 తేదీ నుంచి ఆపరేషన్ల కూడా చేయడం ప్రారంభించింది. ఇప్పటికే 182 కాటరక్ట్ ఆపరేష న్లు విజయవంతంగా నిర్వహించారు. గుర్తించిన వారికి సీ రియల్‌గా రోజు కంటి ఆపరేషన్లు జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ దవాఖాన, లైన్స్ క్లబ్ ఐ దవాఖాన బోధన్‌లో చేస్తున్నారు.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...