పుకార్లను నమ్మొద్దు


Wed,September 19, 2018 02:46 AM

నవీపేట : గణేశ్ నిమజ్జన ఉత్సవాలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో అల్లరి మూకలు సోషల్ మీడియాలో లేనిపోనివి సృష్టించే పనిలో ఉంటారని, అలాంటి పుకార్లను ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దని అడిషనల్ డీసీపీ శ్రీధర్‌రెడ్డి సూచించారు. నవీపేట పోలీస్ స్టేషన్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన శాంతికమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలు మూలల నుంచి గణేశ్ విగ్రహాలను బాసర గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు భక్తులు వచ్చే అవకాశాలు ఉందన్నారు. జానకంపేట్ నుంచి బాసర బ్రిడ్జి వరకు రోడ్డుపై గుంతలకు మరమ్మత్తులు చేపట్టేలా ఆర్‌అండ్‌బీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూ చించారు. బాసర రోడ్డుపై వన్‌వే ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. బాసర నదిలో నిమజ్జనం అనంతరం వాహనాలను నాయగామ్, మీదుగా వయా కందకుర్తి గ్రామానికి వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు సేవలను అందించేందుకు వచ్చే వలంటీర్లకు టీ షర్టులను డీసీపీ అందజేశారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ మాట్లాడారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ జగదీశ్, తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సయ్యద్ సాజీద్, ఎంపీపీరాజేందర్‌గౌడ్, ఎంపీటీసీ సూరిబాబు, ఏఈలు ప్రసాద్‌రావు, దినేశ్, గణేశ్ మండపాల నిర్వాహకులు, ముస్లిములు పాల్గొన్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...