ఎస్సారెస్పీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల


Tue,September 18, 2018 02:24 AM

మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాలువలకు నీటి విడుదల కొనసాగుతునట్లు ప్రాజెక్టు ఏఈఈ మహేందర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 1085.10 అడుగులు (67.154 టీఎంసీలు) నీరుంది. గతేడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం1075.80 అడుగులు (41.702 టీఎంసీలు) ఉంది. కాకతీయ కాలువ నుంచి 5,500క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 400క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు,గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు 630క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 595క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి 7,225 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో పోతుందన్నారు.

కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడు టర్బయిన్లతో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ఇన్‌చార్జి ఎస్‌ఈ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. కాకతీయ కాలువలో వదిలిన 5,500 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని ఒక్కో టర్బయిన్ నుంయి 6.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...