ఎల్లమ్మగుట్ట: వినాయకచవితిని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను బుధవారం ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుతూ మట్టి వినాయకులను పూజించాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ సుబేదార్ అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి ధన్పాల్ శ్రీనివాస్, ఆకుల అశోక్, శ్యాం అగర్వాల్, కట్కం శ్రీనివాస్, బీరెల్లి విజయ్‌రావు, వి.శ్రీనివాస్‌రావు, రాజేశ్వర్ తదతరులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాలలో...
బస్టాండ్ సమీపంలోని ఆదర్శ హిందీ మహావిద్యాలయంలో బుధవారం విద్యార్థులతో మట్టి గణపతులను తయారు చేయించారు. విద్యార్థులకు మట్టి గణపతుల విశిష్ఠతను వివరించారు. విద్యార్థులు తయారుచేసిన గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గంగాధర్, నారాయణ్, లింబాద్రి స్వామి, రాజ్‌కుమార్, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
పూలాంగ్ ప్రభుత్వ పాఠశాలలో...
సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో నగరంలోని పులాంగ్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో బుధవారం మట్టి గణపతులను తయారు చేయించారు. ప్రధానోపాధ్యాయుడు నాగరాజు మట్టి వినాయకులను తయారు చేసే విధానాన్ని, ఆకృతులను దగ్గరుండి చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో
వినాయక్‌నగర్: బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో విద్యార్థులు మట్టిగణపతులను తయారు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉజల, కాశిరెడ్డి నారాయణ రెడ్డి, డైరెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మి విలాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో .....
లక్ష్మి విలాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను అందజేశారు. కార్యక్రమంలో మేనేజర్ నాగరాజు, లవన్‌కుమార్, సత్యానంద్, హన్మంత్‌రెడ్డి, సాయికిరణ్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
వాసవి స్పేస్ పాఠశాలలో విద్యార్థులు బుధవారం మట్టిగణపతులను తయారు చేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రాజేశ్వర్, నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్‌లోని కేసీ పౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు మట్టిగణపతులను తయారు చేశారు. ప్రతి సంవత్సరంలాగే మట్టి గణపతులను తయారు చేస్తున్నామని కేసీ పౌండేషన్ చైర్మన్ రోసిలినా, రాహుల్‌బాబు తెలిపారు. సెయింట్ జేవియర్స్ పాఠశాలలో బుధవారం విద్యార్థులు మట్టిగణపతులను తయారు చేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నరసింహారావు, ప్రిన్సిపాల్ లతగౌడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.