మండల స్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు


Wed,September 12, 2018 01:58 AM

వర్ని: మండలంలోని మోస్రా గ్రామంలో ఈనెల 17, 18, 19న నిర్వహించే వర్ని, రుద్రూర్ మండలాల మం డల స్థాయి క్రీడా పోటీల పనులు ప్రారంభించినట్లు జడ్పీటీసీ గుత్ప విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. మోస్రా ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలపై ఎం ఈవో శాంతాకుమారి, ఎంపీడీవో శ్రీనివాసరావు, వడ్డేపల్లి ఉన్నత పాఠశాల పీడీతో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా భా స్కర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలకోసం గ్రౌండ్ రిపేర్లు, క్రీడల నిర్వహణకు సంబంధించిన ఫుడ్ కమిటీ, ఆటల కమిటీ, గ్రౌండ్ కమిటీ, స్టేజీ కమిటీ తదితర కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు, ఆటలను చూడడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయిస్తున్నట్లు భాస్కర్‌రెడ్డి తెలి పారు.

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...