లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ


Wed,September 12, 2018 01:58 AM

ఎడపల్లి : ఎడపల్లి మండలంలోని అంబం గ్రామంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో నిరుపేదమహిళలకు చీరలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ గ్రామంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు ఈ.లింగం తన సొంత ఖర్చులతో నిరుపేద మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మండలంలోని 17 గ్రామాల్లో నిరుపేద మహిళలకు చీరలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. మం డలంలో దాదాపు 250 చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, లయన్స్‌క్లబ్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, మండల కార్యదర్శి గంగారెడ్డి, జోనల్ చైర్మన్ మెర్సి, మాజీ ఉప సర్పంచ్ ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.

187
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...