ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి


Wed,September 12, 2018 01:58 AM

శక్కర్‌నగర్ : ముందస్తు ఎన్నికల్లో భాగంగా డివిజన్‌లోని త హసీల్దార్లు పూర్తి సమాచారంతో సంసిద్ధంగా ఉండాలని బో ధన్ ఆర్డీవో కె.గోపీరాం సూచించారు. మంగళవారం బోధన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో డివిజన్‌లోని తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలని, నూతనంగా ఓటర్ల నమోదు, ఇప్పటి వరకు ఉన్న ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉంచాలన్నారు. బోధన్ డి విజన్‌లోని మండలాల వారీగా, గ్రామాల్లో పోలింగ్‌బూత్ లు, అక్కడ ఉన్న సదుపాయాలు ముందుగానే పరిశీలించాన్నారు. ఓటర్ల జాబితా విషయంలో ఎలాంటి తప్పులు లే కుండా చూడాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఓటర్ల సంఖ్య పెరిగితే పోలింగ్‌బూత్‌లు పెంచాల్సి ఉంటే ముం దుగానే సదరు బూత్‌లను గుర్తించాలన్నారు. పో లింగ్‌బూత్‌లు ప్రశాంత వాతావారణంలో కొనసాగేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఏ వైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే తనకు తెలియజేయాలని అన్నారు. బోధన్ తహసీల్దార్ గం గాధర్, డివిజన్‌లోని ఎడపల్లి, రెంజల్, నవీపే ట్, వర్ని, కోటగిరి, రుద్రూర్ మండలాల తహసీల్దార్లు లత, రేణుకా చౌహాన్, అనీల్‌కుమార్, హరిబాబు, విఠల్, రాజలు పాల్గొన్నారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...