ఘనంగా ఫ్రెషర్స్‌డే వేడుకలు


Wed,September 12, 2018 01:57 AM

శక్కర్‌నగర్ : బోధన్ పట్టణ శివారులోని ఇందూర్ బీఈడీ కళాశాలలో, పట్టణంలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఏడు విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ విద్యా సంస్థలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం ముఖ్య అతిథులు విద్యార్థులకు బహుమతులను అందచేశారు.

లక్ష్యం సాధన దిశగా విద్యాభ్యాసం కొనసాగించాలి
విద్యార్థులు లక్ష్యసాధనే ధ్యేయంగా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని బోధన్ ఏసీపీ రఘు అన్నారు. బోధన్ పట్టణంలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందూర్ బీఈడీ కళాశాలలో కరస్పాండెంట్ థామస్, ప్రిన్సిపాల్ అప్పల్‌నాయుడు, మిమ్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఏసీపీ రఘుతో పాటు బోధన్ పట్టణ ఎస్‌హెచ్‌వో గిరిజాల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వీఆర్.దేశాయ్, మిమ్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

197
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...