అవార్డు పొందిన అధ్యాపకులకు సన్మానం


Wed,September 12, 2018 01:57 AM

డిచ్‌పల్లి/నమస్తేతెలంగాణ: తెలంగాణ విశ్వవిద్యాలయంలో టీయూ అధ్యాపకుల సంఘం (టూటా) ఆధ్వర్యంలో అవార్డులు పొందిన అధ్యాపకులను మంగళవారం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సమావేశ మందిరంలో టీయూ వీసీ సాంబయ్య సన్మానించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్ధ ప్రకటించిన ప్రెసిడెన్సియల్ అవార్డుకు ఎంపికైన తెలుగు అధ్యయన శాఖ సహాయ అధ్యాపకుడు డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, తెలుగు శాఖ విభాగాధిపతి వంగరి త్రివేణి, గుల్ ఈ రాణా, ప్రిన్సిపాల్ శిరీషా, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి సత్యానారాయణకు అవార్డులు రావడం టీయూకే గర్వకారణమని వీసీ అన్నారు. కార్యక్రమంలో టూటా అధ్యక్షుడు కంకట రాజారాం, ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి పున్నయ్య, జాయింట్ సెక్రెటరీ మూసా ఖురీషి, కోశాధికారి అతీక్ సుల్తాన్, ఈసీ సభ్యులు అత్తర్ సుల్తానా, జాన్సన్ దామెర, పి.శాంతాబాయి, సంపత్‌కుమార్, నందిని విద్యార్థులు పాల్గొన్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...