టీయూ రిజిస్ట్రార్ పదవికి శివశంకర్ రాజీనామా


Wed,September 12, 2018 01:56 AM

డిచ్‌పల్లి/ నమస్తే తెలంగాణ: తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ శివశంకర్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడం వర్సిటీలో సంచలనం కలిగింది. వీసీ సాంబయ్యతో బేధాభిప్రాయం రావడంతోనే రిజిస్ట్రార్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. శివశంకర్ గతేడాది అక్టోబరు 23న రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఏడాది కూడా పూర్తి కాకుండానే పదవికి రాజీనామా చేయడంతో టీయూ అధ్యాపక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా వీసీకి, రిజిస్ట్రార్‌కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. కోర్సుల ఎత్తివేత, ప్రొఫెసర్ల బదిలీల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు తెలిసింది. ఈ నేపథంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...