జానపద కళాకారుల అభివృద్ధికి కృషి


Wed,September 12, 2018 01:56 AM

ఆర్మూర్ టౌన్: జానపద కళాకారుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆర్మూర్‌లో జిల్లా జానపద కళాకారుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వంగ శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జానపద కళాకారుల 29 డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్య సలహాదారు రమణాచారి నేతృత్వంలో సీఎం కేసీఆర్‌ను కోరామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతోనే జానపద కళాకారులకు గుర్తింపు లభించిందని, అర్హులకు పింఛన్లు అందుతున్నాయని, కళాకారులకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించారని అన్నారు. జిల్లా జానపద కళాకారుల సంఘంపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జిల్లా సంఘంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగనప్పటికీ వ్యక్తిగతంగా సంఘంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. తెలంగాణ జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చౌకె లింగం మాట్లాడుతూ... కళాకారులకు కార్యక్రమాలు ఇప్పిస్తూ సహకరిస్తున్నామని, గిట్టని వారు తనపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. సంఘం అభివృద్ధికి, కళాకారులకు చేసిన సేవలను వివరించారు. సంఘం సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...