రాష్ట్ర ప్రగతికి కేసీఆర్ నాయకత్వం అవసరం


Mon,September 10, 2018 02:54 AM

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని చెప్పారు మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి. కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని ఆయన స్వగృహంలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని తన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కేఆర్ సురేశ్‌రెడ్డి ఆదివారం సమావేశం నిర్వహించారు. రెండు నియోజకవర్గాల నుంచి ఇంత కాలం ఆయన వెంట కొనసాగిన అనుచరులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేశ్‌రెడ్డి వారినుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మూడున్నర దశాబ్దాలుగా సేవలు అందిస్తూ వచ్చామన్నారు. అధిష్టానం మాట ప్రకారం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తూ త్యాగాలు చేశామన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారి పట్ల అనుసరిస్తున్న వైఖరి విచారం కలిగించాయన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడుపుతూ ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ర్టాన్ని ఆర్థికంగా, అభివృద్ధిపరంగా, సంక్షేమపరంగా దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుతున్న తీరు రాష్ట్ర ప్రజలందరికీ సుష్పష్టంగా తెలిసిందేనన్నారు. ఈ వాస్తవాలను గుర్తించిన సమయంలో టీఆర్‌ఎస్ నుంచి ఆహ్వానం అందడం, దీన్ని తెలంగాణ అభివృద్ధిలో సహకరించే సదావకాశంగా భావించి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించానని చెప్పారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి మన సహకారం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ ఇచ్చిన హామీపై తనకు పూర్తి విశ్వాసముందన్నారు. ఈ నెల 12న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుదామన్నారు. ఇందుకు కార్యకర్తలు, అనుచరులు సంసిద్ధత వ్యక్తం చేశారు. సురేశ్‌రెడ్డి వెంట టీఆర్‌ఎస్‌లో చేరడానికి తామంతా సిద్ధమని స్పష్టం చేశారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...