ప్రశాంత్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం


Mon,September 10, 2018 02:54 AM

ఏర్గట్ల: మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ కవిత, బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటానికి ఏర్గట్ల గ్రామస్తులు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆదివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భగా టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామాభివృద్ధి కోసం ప్రశాంత్ రెడ్డి రూ.కోటీ 53 లక్షల నిధులు మంజూరు చేయించారని హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.కోటి, మల్లన్న దేవాలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.4 లక్షలు, పెద్దమ్మ ఆలయ ఆవరణలో ముదిరాజ్ సంఘ సభ్యుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు, షాదీఖాన కోసం రూ.15 లక్షలు, పీఏసీఎస్ కార్యాలయ ప్రహరీ నిర్మాణానికి రూ.4 లక్షలు, బద్దం చిన్న సంఘం మిగులు పనులకు రూ.3 లక్షలు, నాయీ బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం రూ.5 లక్షలు, ఎస్సీల కోసం అంబేద్కర్ భవన్ నిర్మాణానికి రూ.7 లక్షల 50 వేలు, కుమ్మరి శాలివాహన సంఘం కమ్యూనిటీ హాల్‌కు రూ.5 లక్షలు, శివాలయం వద్ద కమ్యూనిటీ హాల్‌కు రూ.5 లక్షల నిధులను ప్రశాంత్‌రెడ్డి మంజురు చేయించారని హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు రాజపూర్ణానందం, మధు జక్కని, సొసైటీ చైర్మన్ లింగారెడ్డి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సహదేవ్, మండల నాయకలు జైనోద్దీన్, ఉపేందర్ రెడ్డి, రాములు, మేకల సాయన్న, గంగారాం, తుపాకుల శ్రీనివాస్, బద్దం ప్రభాకర్, దొబ్బల రాజేశ్, లక్కం నర్సయ్య, మంగలి గంగాధర్, నర్సయ్య, చిన్న భూమన్న, సదానంద్, మల్లయ్య, అనిల్ యాదవ్, రశీద్, గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

251
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...