షకీల్‌కు ఘన స్వాగతం


Sun,September 9, 2018 02:22 AM

బోధన్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ బోధన్ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారైన అనంతరం తొలిసారిగా బోధన్‌కు శనివారం వచ్చిన మహమ్మద్ షకీల్ ఆమేర్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్థానిక నెహ్రూనగర్ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలకడానికి బోధన్ పట్టణం, బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాల నుంచి తరలివెళ్లిన టీఆర్‌ఎస్ శ్రేణులు షకీల్‌ను బైక్, వాహనాల ర్యాలీతో బోధన్ వరకు తీసుకువచ్చారు. బోధన్‌కు వచ్చిన ఎమ్మెల్యే షకీల్ అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జలాల్ బుఖారీ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ర్యాలీలో టీఆర్‌ఎస్ బోధన్ పట్టణ కన్వీనర్ వీఆర్ దేశాయ్, మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు సంజీవ్‌కుమార్, డి.శ్రీరామ్, భూమ్‌రెడ్డి, వి.నర్సింగ్‌రావు, రైతు సమన్వయ సమితి బోధన్ మండల కో-ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, బోధన్ శివాలయం చైర్మన్ పాలవార్ సాయినాథ్, మారుతీ మందిరం చైర్మన్ గుమ్ముల అశోక్‌రెడ్డి, నాయకులు తూము శరత్‌రెడ్డి, పి.గంగాధర్‌గౌడ్, జాడె సతీశ్ కుమార్, దూప్‌సింగ్, కృష్ణ, ఎత్తేశామ్, మహిమూద్ హుస్సేన్, డబ్బు, బోధన్ నాయకులు షకీల్, చిన్నోళ్ల ముత్తెన్న, వెంకట్‌రెడ్డి, నాగరాజు, నీరడి లక్ష్మణ్, రెంజల్ నాయకులు గోపాల్‌రెడ్డి, మౌలానా, కాశం సాయిలు, తెలంగాణ శంకర్, ఎడపల్లి నాయకులు ఆకుల శ్రీనివాస్, పోల మల్కారెడ్డి, ప్రమీల, నవీపేట్ నాయకులు దాస్, అబ్బన్న, రమేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

228
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...