రేపు జిల్లా సీనియర్ క్రికెట్ జట్ల ఎంపికలు


Sun,September 9, 2018 02:21 AM

నిజామాబాద్ స్పోర్ట్స్: నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10న జిల్లాస్థాయి సీనియర్ క్రికెట్ జట్ల ఎంపికలు జరగనున్నట్లు జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.చంద్రసేన్‌రెడ్డి, ఎం.వెంకట్‌రెడ్డి శనివారం తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆదేశానుసారం ఈ సంవత్సరం జిల్లాస్థాయి లీగ్ మ్యాచ్‌ల కోసం జిల్లా జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి నుంచి రెండు జట్లు, ఆర్మూర్ నుంచి ఒక జట్టును ఆహ్వానిస్తున్నమని అన్నారు. ఈనెల 10న బోధన్ మండల పరిధిలోని వివిధ ప్రాంతాల క్రీడాకారుల కోసం బోధన్ మండల జట్టును ఎంపిక చేస్తామన్నారు. 11న నిజామాబాద్ నుంచి మూడు జట్ల ఎంపికలు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ ఎంపికలకు 18నుంచి 24ఏళ్లలోపు క్రీడాకారులు హాజరుకావాలన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు పైన తెలిపిన తేదీలలో మధ్యాహ్నం 2 గంటలకు కంఠేశ్వర్‌లోని ఎంఎస్‌ఆర్ గ్రౌండ్‌లో రిపోర్ట్ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9849202586 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.

207
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...