బోధన్‌కు సుదర్శన్‌రెడ్డి చేసిందేమీ లేదు..


Sun,September 9, 2018 02:21 AM

బోధన్, నమస్తే తెలంగాణ: బోధన్ నియోజకవర్గానికి 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, చాలాకాలం పాటు రాష్ట్ర మంత్రిగా కొనసాగిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పేందుకు బహిరంగ చర్చకు రావాలని బోధన్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ షకీల్ ఆమేర్ శనివారం సవాల్ చేశారు. షకీల్ తన నివాస గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సుదర్శన్‌రెడ్డి కంటే తాను నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ సహకారంతో ఎక్కువ అభివృద్ధి చేశానని అన్నారు. సుదర్శన్‌రెడ్డి ఏం చేశారో చెప్పేందుకు తనతో బహిరంగ వేదికపైకి చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
రెండు రోజుల క్రితం ఒక దళిత దివ్యాంగుడు సుదర్శన్‌రెడ్డిని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయి దాడికి పాల్పడటం అమానుషమన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ నాయకులు నిన్నటివరకు ఎన్నికలు వస్తే తమ తడాఖా చూపిస్తామని చెప్పారని, ఇప్పుడు ఎన్నికలంటే భయపడిపోతున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు రావని ఎద్దేవా చేశారు.

ప్రజలంతా ఆశీర్వదించాలి
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బోధన్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్న తనను గతంలో మాదిరిగానే ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను షకీల్ కోరారు. ఇక్కడి అభివృద్ధిని చూసి మహారాష్ట్రలోని అనేక గ్రామాలు తెలంగాణాలో కలుస్తామంటూ ఆందోళన చేస్తున్నారన్నారు. గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి రూ.2,800 కోట్లు ఖర్చుచేశామని షకీల్ వెల్లడించారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, టీఆర్‌ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు వీఆర్ దేశాయ్, పార్టీ బోధన్ మండలాధ్యక్షుడు సంజీవ్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు అప్పిరెడ్డి, తూము శరత్‌రెడ్డి, పోలా మల్కారెడ్డి, ప్రమీల, ఆత్మెల్ల శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

227
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...