ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం


Sat,December 14, 2019 12:33 AM

శాలిగౌరారం : ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పిన ఘటన మండల పరిధిలోని ఎన్జీకొత్తపెల్లి, రామాంజపురం గ్రామాల మధ్య శుక్రవారం జరిగింది. ప్రయాణికులు, బస్‌ డ్రైవర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌ నుంచి వయా శాలిగౌరారం మీదుగా మోత్కూర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్‌ మండలంలోని ఎన్జీకొత్తపెల్లి, రామాంజపురం గ్రామాల మధ్యకు చేరుకోగానే పొలం దున్నేందుకు వస్తున్న ట్రాక్టర్‌ పిల్లబాటగుండా అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో బస్‌ డ్రైవర్‌ బస్‌ను మెల్లగా రోడ్డు కిందకి దింపి ప్రమాదాన్ని తప్పించాడు. రోడ్డు పక్కనే గోతి ఉండడంతో కొద్దిమేర వెళ్లినట్లయితే పెను ప్రమాదం జరిగి ఉండేది. ఆ సమయంలో బస్సులో 18మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు పక్కకు తిప్పే సమయంలో చేతి గాజులు పగిలిపోయినట్లు మహిళలు తెలిపారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ అజాగ్రత్తగా రోడ్డును ఎక్కియ్యడం వలనే సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐకి సమాచారం ఇచ్చినట్లు బస్‌ డ్రైవర్‌ నాగాచారి తెలిపారు.
భయమేసింది..
బస్సు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ట్రాక్టర్‌ అడ్డు రావడంతో డ్రైవర్‌ గమనించి బస్సును రోడ్డు కిందికి దింపాడు. లేదంటే బస్‌లో ఉన్న వాళ్లమంతా ప్రమాద బారిన పడేవాళ్లం. బస్‌ రోడ్డు కిందికి పోతుంటే ప్రాణం పోయినట్లు అయింది. డ్రైవర్‌ పసిగట్టడం వలనే ప్రమాదం తప్పింది.
- పార్వతమ్మ, బండమీదిగూడెం.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...