గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం


Fri,December 13, 2019 01:25 AM

చిట్యాల : గ్రామాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రా మం లో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.5లక్షలతో నిర్మించనున్న తాగునీటి పైపు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసిన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యం కాబడిన తెలంగాణ పల్లెలు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి గ్రామాల్లో సీసీరోడ్లు, మౌలిక వసతులు కల్పించార న్నారు. గ్రామ అభివృద్ధ్దిలో భాగంగా ప్రభుత్వం ఇటీవల పల్లె ప్రణాళిక కార్యక్ర మం ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో చిట్యాల మం డలాన్ని మరింత అభివృద్ధ్ది చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీత, సర్పంచ్‌ కక్కిరేణి బొందయ్య, నాయకుడు కోమటిరెడ్డి చిన్న వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ బాతరాజు రవీందర్‌, కక్కిరేణి లింగయ్య, రామచంద్రారెడ్డి, ఆవుల లిం గస్వామి, యకారి నరేందర్‌, చింతకాయల నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...