ఊరురా రైతు వేదికలు


Tue,December 3, 2019 01:05 AM

-క్లస్టర్ల వారీగా నిర్మాణానికి ప్రణాళిక
-జిల్లాలో 142 చోట్ల భవన నిర్మాణాలు
-ఇప్పటికే 12 గ్రామాల్లో స్థలాల కేటాయింపు
-మిగతా చోట్లా త్వరలో పూర్తికి చర్యలు
-హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

నీలగిరి : అన్నదాతలకు సంపూర్ణ సహకారం అందించేందుకు తెలంగాణ సర్కార్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రతి క్లస్టర్ పరిధిలో ఒక రైతు సమాఖ్య సమావేశ మందిరాల (రైతు వేదికల) ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వం ఒక్కో భవనానికి సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేయనుంది. ఇప్పటికే ప్రతి 5వేల హెక్టార్లకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించిన విషయం విధితమే. జిల్లా వ్యాప్తంగా 142 క్లస్టర్లు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో రైతుల చేత రైతు సమన్వయ సమితులను సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే సదరు రైతు సమన్వయ సమితుల సభ్యులకు పలు దఫాలుగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. మరికొద్ది రోజుల్లో పంటల సాగు, మార్కెటింగ్, అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సమావేశ మందిరాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఆయన నిర్ణయానికి అనుగుణంగా జిల్లా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా 12 రైతు వేదికల కోసం స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. మరికొద్ది రోజుల్లో మిగిలిన రైతు వేదికలకు స్థలాలను సేకరించి నిర్మాణ పనులు చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్ర రైతు సమన్వయ సమితి కన్వీనర్‌గా పల్లా రాజేశ్వర్‌డ్డిని నియమించిన విషయం విధితమే. వచ్చే వానాకాలంలోపు జిల్లాలో రైతు వేదిక భవనాలు ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది.


12 క్లస్టర్లలో స్థలాల సేకరణ పూర్తి...
ఇప్పటికే పూర్తయిన 12 క్లస్టర్లకు సంబంధించి స్థలాల్లో కొన్నింటిని దాతలు వితరణగా ఇచ్చారు. మరికొన్ని క్లస్టర్లకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. జిల్లా వ్యవసాయశాఖ పరిధిలో మొత్తం 6 వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక కార్యాలయం ఉంది. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా మరో 31మండల వ్యవసాయ శాఖ అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. ఏఓ కార్యాలయాల్లోనే ఏఈఓలు పని చేస్తారు.

రానున్న రోజుల్లో ప్రతి ఏఈఓ పరిధిలో ఒక కార్యాలయం ఉండాలని ప్రభుతం భావిస్తుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 142 క్లస్టర్లు ఉండగా ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈఓను నియమించింది. ఇందులో ప్రస్తుతం 116మంది వ్యవసాయ సహాయ విస్తరణ అధికారులు పని చేస్తున్నారు. 6 చోట్ల ఖాళీ లు ఉండగా మరో 20మంది వెటర్నటి సెలవులు, ఉన్నత చదువుల కోసం సెలవులు పెట్టారు. అయితే జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏఈఓ పరిధిలో ఇక రైతు సమా ఖ్య సమావేశ మందిరాలు నిర్మాణం కానున్నాయి.


క్షేత్రస్థాయిలో నిర్వహణ, మార్కెటింగ్...
నూతనంగా ఏర్పాటు చేసే రైతు సమావేశ మందిరాలు పలు కీలక నిర్ణయాలకు వేదికగా మారనున్నా యి. స్వయం సహాయక సంఘాల మాదిరిగా రైతు సమాఖ్య సమావేశాలు ప్రతి నెల విధిగా జరుగనున్నా యి. ఈసమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సాగు నిర్వహణ జరుగనుంది. పండించిన పంటకు మార్కెట్‌లో సరైన ధర లేనిపక్షంలో స్థానిక కమిటీలే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నాయి.


రైతుల సమస్యల పరిష్కారానికి వేదికలు
రైతు వేదికలు వ్యవసాయ అభివృద్ధికి కేంద్రాలు కానున్నాయి. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సాగు విధానాలు, గిట్టుబాటు ధరలు వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపనున్నారు.


బలోపేతం కానున్న సమన్వయ సమితులు
రైతు వేదికల ఏర్పాటుతో రైతు సమన్వయ సమితులు బలోపేతం కానున్నాయి. కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత పలు దఫాలుగా సమితుల సభ్యులు రైతులకు అవగాహన కల్పించనున్నారు. కమిటీల సభ్యులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్తారు.


రైతు సమన్వయ సమితి విధులు...
రైతులకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు ఈ సమన్వయ సమితులు పని చేయనున్నాయి. పంటల సాగు, దిగుబడి పెంచడం, తదితర అంశాలపై అవగాహన కల్పించాలి. అందరూ ఒకే రకమైన పంట వేసి నష్టపోకుండా డిమాండ్‌కు తగినట్లుగా పంటలు పండించేలా రైతుల్లో చైతన్యం తేవాలి. వ్యవసాయ భూములను వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు క్రాప్ కాలనీలుగా విభజిస్తారు.

దాని ప్రకారం ఏ కాలనీలో ఏ పంట వేయాలో సూచనలు చేస్తారు. దానికి అనుగుణంగా నిర్ణీత పంటలు వేసుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తారు. రైతులకు ఆధునిక పద్ధతులు వివరించడానికి, పరస్పరం చర్చించుకోవడానికి రైతుల వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వాటికి అధికారులు నిర్మాణాల చర్యలు తీసుకుంటున్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...