ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకే కల్యాణలక్ష్మి


Wed,November 20, 2019 01:22 AM

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : ఆడబిడ్డల పెండ్లిళ్లకు తెచ్చిన అప్పులు కట్టలేక ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని, అలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చూడొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశ పెట్టారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 179 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60ఏండ్ల సమైక్య పాలనలో ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో అందరూ చూశారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు, నిధులు మనమే వినియోగించుకుంటామని చెప్పి రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం రాకుండా అర్థం చేసుకొని ఎవరు అడిగినా అడగకపోయినా కుటుంబ పెద్దగా అండగా నిలుస్తున్నారన్నారు. నియోజకవర్గం పరిధిలోని 179మందికి రూ.1,75,46,648 నగదును చెక్కుల రూపంలో అందించగా వీరిలో 173 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, ఆరుగురికి షాదీముబారక్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జేసీ సంజీవరెడ్డి, ఆర్డీఓ మోహన్‌రావు , సూర్యాపేట ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, చివ్వెంల ఎంపీపీ ధరావత్ కుమారి, జడ్పీటీసీ జీడి భిక్షం పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...