మద్దతు ధర చెల్లించకుంటే కఠిన చర్యలు


Fri,November 15, 2019 02:57 AM

త్రిపురారం : రైతులు పండించిన ధాన్యానికి మిల్లర్లు మద్దతు ధర చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ సీఐ జుట్టుకొండ నాగేశ్వర్‌రావు అన్నారు. గురువారం మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో గల సత్యసాయి రైస్‌మిల్, రఘురాం రైస్‌మిల్, శ్రీలక్ష్మీ రైస్ మిల్లుల్లో టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. మిల్లుల్లో ధాన్యం కొనుగోలు పక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడంతో పాటు రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందించాలన్నారు.

మద్దతు ధర కోసమే జిల్లా యంత్రాంగం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసిందని, నిబంధనలు అతిక్రమించే మిల్లులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో తూనికలు, కొలతల అధికారి రామకృష్ణ, ఎస్‌ఐ రామ్మూర్తి ఉన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...