నల్లగొండ, నమస్తే తెలంగాణ: స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన తొలి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా 11ఏళ్లు పని చేసి విద్యా సంస్కరణలను అమలు చేసిన గొప్ప వ్యక్తి డా. మౌలా నా అబుల్ కలాం ఆజాద్ అని ఇన్చార్జి కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మౌలానాఅబుల్ కలాం జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకుల పాఠశాలలో జాతీయ విద్యాదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దేశంలో సమగ్ర విద్యావిధానాల రూపకల్పనకు ఆజాద్ పునాదులు వేశారన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారని, పేద, మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. ఆయన సంస్కరణల్లో భాగంగానే నేడు గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు.