ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు


Tue,November 12, 2019 04:37 AM

అన్ని శాఖల అధికారయంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారంపై అలసత్వం ప్రదర్శించొద్దని ఇన్‌చార్జి కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ సూచించారు. సోమవారం గ్రీవెన్స్‌లో భాగంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి విన్నపాలు స్వీకరించారు. అనంతరం వాటిని ఆయా శాఖల అధికారులకు బదలాయించి పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వారం జిల్లా నలుమూలల నుంచి అధికార యంత్రాంగంపై ఉన్న నమ్మకంతో బాధితులు కలెక్టరేట్‌కు వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్య పరిష్కరించాలన్నారు. అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులపై కింది స్థాయి అధికారులతో సమీక్ష చేసి ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుం డా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రవీంద్రనాథ్, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, సాంఘీక సంక్షేమశాఖ డీడీ రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...