సీఎం రిలీఫ్‌ఫండ్ నిరుపేదలకు వరం


Tue,November 12, 2019 04:36 AM

-ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య
హాలియా, నమస్తే తెలంగాణ: సీఎం రిలీఫ్‌ఫండ్ నిరుపేదలకు వరమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. సోమవారం హాలియాలోని తన నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 31మందికి రూ.9.87లక్షల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పలు మెడికల్ కళాశాలలను ఏర్పాటుచేసి వైద్యసేవలను మరింత మెరుగుపరిచారని అన్నారు. నిరుపేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్ కింద ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, నాయకులు ఎన్నమల్ల సత్యం, చెరుపల్లి ముత్యాలు, కొమ్మనబోయిన చంద్రశేఖర్‌గౌడ్, మాదవరం నరేందర్‌రావు, నలబోతు వెంకటయ్య, చాపల సైదులు, ఇండ్ల అంజిబాబు, అబ్ధుల్ హలీం, పంగ లక్ష్మణ్, గడ్డం రమణయ్య, అజ్ఘర్, బొల్లెపల్లి శేఖర్‌రాజు, ఐతగోని సైదులు, అంజద్‌ఖాన్ పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...