సాఫీగా ఆర్టీసీ ప్రయాణం


Tue,November 12, 2019 04:36 AM

నల్లగొండసిటీ: ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్నా ప్రయాణికుల అవసరాలకనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సోమవారం జిల్లావ్యాప్తంగా 4 డిపోల్లో అత్యధికంగా బస్సులు నడిపారు. మొత్తం 282 బస్సులు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశాయి. తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లతో తెల్లవారుజాము 4గంటల నుంచే బస్సులు పరుగులు పెడుతుండడంతో ప్రయాణికులు నిశ్చింతగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. టికెట్ల మిషన్ల ద్వారా టికెట్లు జారీ చేస్తుండటంతో ప్రయాణికులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ బస్సులు అధికంగా నడుస్తుండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. బస్టాండుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...