సాగర్‌కు 52,301 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


Mon,November 11, 2019 02:29 AM

-589.80 అడుగుల వద్ద సాగర్ నీటి మట్టం
-మూసీకి 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నందికొండ : నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి కొనసాగతున్న ఇన్‌ఫ్లో తగ్గడంతో నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్టు గేట్ల ద్వారా శనివారం రాత్రి నుంచి కొనసాగుతున్న 16,200 క్యూసెక్కుల నీటి విడుదలను ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి బంద్ చేశారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 52,301 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ, క్రస్టు గేట్ల, కుడి, ఎడమ, వరద కాల్వలు ద్వారా మొత్తం 52,641 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

నీటి సమాచారం
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 590 అడుగులకు గాను 589.90 అడుగుల వద్ద 311.7462 టీఎంసీల నీరు ఆదివారం నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 52,301 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. సాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా 8022 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 9567 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32602 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, డీటీ గేట్సు (డైవర్షన్ టన్నెల్) ద్వారా 10 క్యూసెక్కులు, వరద కాల్వల ద్వారా 300క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 52301 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 883.10 అడుగుల వద్ద 205.2258 టీఎంసీల నీరు నిల్వ ఉండగా శ్రీశైలంకు ఎగువ నుంచి 51542 ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.

పులిచింతల @ 174.735 అడుగులు
చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు) అడుగులకు ప్రస్తుతం 174.735 (45.3593 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 42272 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. పులిచింతల ప్రాజెక్టు మొత్తం గేట్లు 24, కాగా 2 గేట్ల నుంచి 30927 క్యూసెక్కుల నీరు, గేట్ల్ల లీకేజీల ద్వారా 1000 క్యూసెక్కుల నీరు, తెలంగాణ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా 18000 క్యూసెక్కుల నీరు, మొత్తం 49927 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో విడుదలవుతుంది.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...