యాదాద్రికి కార్తీక శోభ


Mon,November 11, 2019 02:27 AM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: కార్తీకమాసం ఆదివారం సందర్భంగా యాదాద్రి పుణ్యక్షేత్రంలో హరిహరులను ఆరాధిస్తూ భక్తులు ఆర్జిత పూజలు నిర్వహించారు. సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. ఆదివారం వేకువ జాము నుంచి ఆధ్యాత్మిక పర్వాలు మొదలయ్యాయి. బాలాలయంలో వైష్ణవ ఆచారంగా ఆరాధనలు చేపట్టిన పూజారులు ఉత్సవమూర్తులను పంచామృతంతో అభిషేకించి, తులసీ పత్రాలతో ఆర్పించారు. వేలాది మంది భక్తులు సామూహిక సత్యనారాయణస్వామి వారి వ్రతపూజలు ఆచరించేందుకు తరలిరావడంతో మండపాలు భక్తులతో పోటెత్తాయి. కొండపై తిరువీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

ఆలయంలో దీపారాధన..
కార్తీక ఆదివారం సందర్భంగా మహిళలు దీపారాధన చేపట్టి కుటుంబ సంక్షేమాన్ని వేడుకున్నారు. లక్ష్మీపార్వతులను కొలుస్తూ దీపారాధనలు చేసి తులసీమాతను పూజించారు.

శ్రీవారి ధర్మదర్శనానికి 3 గంటలు..
శ్రీవారి ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ పెరుగడంతో పోలీసులు వాహనాలను కొండపైకి అనుమతించలేదు. ఆర్జిత పూజలు కోలాహలం తెల్లవారు జాము 3 గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ.26,09,864 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...