బాలుడి ఒంట్లో పవర్


Mon,November 11, 2019 02:27 AM

కనగల్ : బాలుడి ఒంట్లో ఉన్న పవర్‌తో ఎల్‌ఈడీ బల్బు వెలుగుతున్న ఘటన ఆదివారం కనగల్ మండలం రేగట్టె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రా మానికి చెందిన జిల్లా విజయ్-పారిజాత దంపతుల కుమారుడు జిల్లా యశ్వంత్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం విజయ్ తన ఇంట్లో లైట్‌కు వైర్ కనెక్షన్ బిగిస్తూ తాను తీసుకొచ్చిన ఎల్‌ఈడీ బల్బును తన కుమారుడికి పట్టుకోమని ఇచ్చాడు. అయితే య శ్వంత్ సదరు బల్బును చేతిలో ఉంచగానే ఆకస్మాత్తుగా వెలిగింది. చేయి తీసివేయగానే ఆరిపోయిం ది. ఈ విషయాన్ని అతను తండ్రికి చెప్పగా ఆశ్చర్యానికి గురైన విజయ్ బల్బును పదే పదే అతడి చేతిలో పెట్టి చూశాడు. బాలుడి ఒంట్లో ఎక్కడ బల్పు ఉంచినా అది వెలుగుతోంది. తిరిగి అదే బల్పు వేరే వారు ముట్టుకుంటే వెలగడం లేదు. యశ్వంత్ పట్టుకున్నంత సేపు ఎల్‌ఈడీ బల్బు నిరంతరాయంగా వెలుగుతుండటంతో గ్రామస్తులంతా వచ్చి ఆశ్చరంగా పరిశీలిస్తున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...