ఆగని ఆర్టీసీ ప్రయాణం


Mon,November 11, 2019 02:27 AM

మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో అధికారులు ఏర్పాటుచేసిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణికులు సాఫీగా ప్రయా ణం సాగించారు. కార్మికులు సమ్మె చేప ట్టి ఆదివారానికి 37రోజులు కావస్తున్నా అధికారులు ప్రత్యామ్నాయ డ్రైవ ర్లు, కండక్టర్లతో 50ఆర్టీసీ, 36 అద్దె బస్సులు మొత్తం 86బస్సులను నడిపించింది. దీంతో ప్రయాణికులు వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుతున్నారు. మిర్యాలగూడ డిపో నుంచి హైదరాబాద్, నల్లగొండ, విజయవాడ, కోదాడ, ఖమ్మం, భద్రాచలం, దేవరకొండతో పాటు ఇతర ప్రాంతాలకు బస్సులను నడిపించినట్లు డిపో మేనేజర్ సుధాకర్‌రావు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...