ప్రభుత్వ పథకాలకు ఆకర్శితులై టీఆర్‌ఎస్‌లో చేరికలు


Mon,November 11, 2019 02:27 AM

-మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి
చండూరు, నమస్తేతెలంగాణ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమపథకాల పట్ల ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చండూరు మున్సిపాలిటీకీ ప్రముఖ వ్యాపారవేత్త తేలుకుంట్ల చంద్రశేఖర్, బూతరాజు దశరథలు కాంగ్రెస్ పార్టీ నుంచి కూసుకుంట్ల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అదేవిధంగా టీఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థి నాయకుడు ఇరిగి రామకృష్ణ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుసమన్వయ సమితి సభ్యులు కోడి వెంకన్నమాజీ సర్పంచ్ కలిమికొండ పారిజాతజనార్దన్, తేలుకుంట్ల జానయ్య, హైమద్, గూడూరు జనార్దన్, భీమనపల్లి శేఖర్, పున్న దర్మేంద్ర, నాగిళ్ల వెంకటయ్య, కొంపెల్లి వెంకటేష్, వడ్డెపల్లి గోపాల్, మొగుదాల దశరథ, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...