ధాన్యం కొనుగోలుకు టోకెన్లు జారీ


Mon,November 11, 2019 02:27 AM

మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులు ధాన్యం అమ్ముకొనేందుకు వ్యవసాయ మార్కెట్ ద్వారా టోకెట్ల విధానం ప్రవేశపెడుతున్నట్లు మార్కెట్ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ సెక్రెటరీ పి.ప్రసాదరావుతో కలిసి టోకెన్ కౌంటర్ ప్రారంభించి రైతులకు టోక్‌లు జారీచేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం విక్రయించడంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే టోకెన్ విధానం అవలంభిస్తున్నామన్నారు. టోకెన్లు జారీ చేసేందుకు మండలంలో నాలుగుప్రాంతాలు ఏర్పాటుచేశామని, వేములపల్లి మండల రైతులకు అన్నపురెడ్డిగూడెం స్టేజీవద్ద గల శ్రీవెంకటేశ్వర్ల ఎరువు దుకాణంలో, త్రిపురారం, తుంగపహాడ్, జెడ్వీగూడెం, అన్నారం రైతులకు శ్రీనివాసనగర్‌లోని సాంబ శివా రైస్‌మిల్ ఎదుట, దామరచర్ల, అడవిదేవులపల్లి, కొత్తగూడెం, లక్ష్మీపురం, రుద్రారంవైపు రైతులకు గూడూరు గ్రామం వద్ద వైష్ణవి వంచర్ వద్ద, నేరేడుచర్ల, రాయినిపాలెం, ఆలగడప, ములక్కలక్లావ, జాలుబాయితండ, అవంతీనురం, సుబ్బారెడ్డిగూడెం రైతులకు అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యాన్ని ట్రాక్టర్‌లో తీసుకువచ్చిన రైతులకు మాత్రమే టోకెన్ జారీచేస్తారని తెలిపారు. ధాన్యం తెచ్చి టోకెన్ పొందాలని సూచించారు. ఈ విషయం రైతులు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ధీరవత్ మేగ్యానాయక్, అస్టెంట్ సెక్రెటరీ సైదారెడ్డి, డైరెక్టర్ పులి జగదీష్‌బాబు, సూపర్‌వైజర్లు దైద సైదులు, గిరిప్రసాద్, పున్నం రవి పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...