చలి షురూ..


Sun,November 10, 2019 01:22 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : జిల్లాలో చలి ప్రభావం ప్రారంభమైంది. వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆ ప్రభా వం క్రమంగా పెరుగుతోంది. గడిచిన వారం రోజులుగా ఉదయం మంచు కురుస్తుండగా అర్థరాత్రి తర్వాత చలి ప్రభావం పెరుగుతోంది. చివరి వారంలో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలకు పడిపోయి ఆ తర్వాత క్రమంగా 30నుంచి 33 డిగ్రీల వరకు పెరిగింది. తాజాగా గరిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు లేకపోయినా కనిష్ట ఉష్ణోగ్రత మాత్రం స్వల్పంగా తగ్గడంతో చలి ప్రభావం కనిపిస్తోంది. గడిచిన మూడు రోజులుగా 32 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత మాత్రం 23 నుంచి 23.4 డిగ్రీల వరకు నమోదవుతోంది.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...