ఎక్కడా రాజీపడబోను..


Sat,November 9, 2019 05:01 AM

-విద్యాశాఖలో ఉద్యోగం సామాజిక బాధ్యత
-ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా పనిచేయాలి
-విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుతోనే
గుణాత్మక విద్య -నమస్తే తెలంగాణతో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి
నల్లగొండ విద్యావిభాగం : పేద కుటుంబం.. అమ్మానాన్న కష్టపడితేనే జీవనం సాగే పరిస్థితి. ఆ దిశలో విద్యలో రాణించి ఉన్నతస్థాయిలో ఉండాలనే సంకల్పంతో వెనుదిరిగి చూడకుండా ప్రాథమిక విద్యనుంచి ఉన్నత విద్యవరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుపూర్తి. ఓవైపు చదువు మరోవైపు ఉద్యోగసాధనకై ఎందరో స్ఫూర్తినీయులను ఆదర్శంగా తీసుకుని ఇష్టంతో కష్టపడి చదివి జీవితంలో స్ధిరపడాలంటే పేదరికం అడ్డుకాదని నిరూపించి.. చివరకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీప్యూటీ డీఈఓ)గా ఎంపికయ్యారు. 2008లో తొలి పోస్టింగ్ కరీంనగర్ జిల్లాలో తర్వాత సొంత జిల్లా వరంగల్‌లో పనిచేస్తూ బదిలీపై ఇటీవలే మన జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన భిక్షపతి. సమాజ నిర్మాణానికి మూలమైన విద్యాశాఖలో అందరి సహకారంతో విద్యావ్యాప్తికి ఆశించి సాధించిన అదృష్టం అంటూ... తన విజయప్రస్థానం-సేవానిరతి, నిబద్ధతను నమస్తే తెలంగాణతో ముచ్చటించారు.

విద్యాభ్యాసం ఇలా..
ప్రాథమిక విద్య వరంగల్ జిల్లాలోని పరకాలల్లో ఉన్నత విద్యా సోషల్ వెల్పేర్ పాఠశాల -జకారంలో పూర్తిచేశారు. తర్వాత ఇంటర్మీడియేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల -పరకాలలో, డిగ్రీ వరంగల్‌లోని ఎల్‌బీ కళాశాలలో చదివారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో 2000-02లో ఎంఏ-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆ తర్వాత 2004-05లో ఉస్మానియా యూనిర్సిటీలో ఉపాద్యాయ విద్య (బీఈడీ) కోర్సు చదువుతోనే వివిధ రంగాల్లో రాణించిన మహనీయులు, సీనియర్‌ను స్ఫూర్తిగా తీసుకుంటూ ఉద్యోగసాధనకై ప్రణాళికతో చదువు కొనసాగింది.

ప్రత్యేక ప్రణాళిక, నిరంతర సాధనతో ఉద్యోగం
యూనివర్సిటీల్లో చదువుతున్న రోజుల్లోనే సీనియర్స్, ఇతర రంగాల్లో రాణించిన వారి స్ఫూర్తితో ప్రణాళికతో చదువు పూర్తి చేసేలోగా ఉద్యోగం సాధించాలనే సంకల్పం. యూనివర్సిటీ లైబ్రరీ, అందుకు సంబంధించిన పుస్తకాలను సేకరించి చదువుతున్న క్రమంలోనే 2008 లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చింది. దృష్టంతా ఉద్యోగసాధన పైనే ఉంచి చదివి పరీక్షలు రాశాను. ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు రావడంతో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్/ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-1 ఉద్యోగానికి ఎంపికైనా.

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ..
పదో తరగతి విద్యార్థులో ఆత్మసైర్ధ్యం పెంచి వార్షిక పరీక్షల ఫలితాలల్లో ఉత్తమ గ్రేడ్స్ సాధించేలా ప్రణాళికతో చదివించాలని ఇటీవల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్‌తో నిర్వహించిన సమావేశంలో సూచించాం. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ సైతం వెల్లడించారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహి స్తు మార్చి-2020లో జరిగే పరీక్షల ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచాలనేది సంకల్పం. అయితే అన్ని యాజమాన్యాల పాఠశాలలు దీనిలో భాగస్వామ్యమై ప్రత్యేక దృష్టితో చదివిస్తేనే లక్ష్యం చేరుకోగలం. అదేవిధంగా మిగితా తరగతుల్లోని విద్యార్థులను సైతం ఇదే తీరులో విద్యా బోధిస్తూ ముందుకేళ్తే వారిలో సృజనాత్మకత వెలుగులో రావడంతోపాటు భవిష్యత్తుకు బంగారు బాటవేసుకోగలుగుతారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...