పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి


Sat,November 9, 2019 04:58 AM

కలెక్టరేట్: గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి అన్నారు. పెద్దపల్లి మండలం కుర్మపల్లిలో శుక్రవారం గ్రామస్తులకు చెత్త బుట్టలను ఎంపీపీ పంపిణీ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ప్రజారోగ్యంపై దృ ష్టి సారించి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్ర మాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా ఊరూరా స్వచ్ఛత కార్యక్రమాలను చేపడుతున్నారని వివరించారు. ప్లాస్టిక్ వాడకం కలుగుతున్న అనర్థాలను దృష్టిలో పెట్టుకుని వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో స్వచ్ఛత విషయంలో అమలు చేస్తున్న పంచసూత్రాలను పకడ్బందీగా గ్రామాల్లో అమలు చేసే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ముందుకెళ్లాలని కోరారు. పంచసూత్రాల అమలులో భా గంగా ఇంటింటికీ కిచెన్‌గార్డెన్ పేరుతో నిత్యం అవసరమ య్యే కూరగాయల చెట్ల పెంపకంతో పాటు పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటి పచ్చదనం పర్చుకునేలా గ్రామాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు భాగ్యలక్ష్మి, షమీమా, కవిత, కమల, సారమ్మ, తిరుపతి పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...