ప్లాస్టిక్ పూర్తిగా నిర్మూలించాలి


Sat,November 9, 2019 04:58 AM

కాల్వశ్రీరాంపూర్ : ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించాలని మండల ప్రత్యేకాధికారి, డీఏఓ తిరుమల్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని తారుపల్లిలో డీఏఓ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ చెత్త, ప్లాస్టిక్ వస్తువులను సేకరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయ కుండా, తడి పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ సిబ్బందికి అప్పగించాలని కోరారు. ప్లాస్టిక్ వాడడంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదముందని సూచించారు. ప్రజలను చైతన్యపరుస్తూ ఇంటింటికీ తిరుగుతూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ భైరం రమేశ్, ఉప సర్పంచ్ శిరీష, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్, ఏఓ నాగార్జున, అంగన్‌వాడీ టీచర్లు రాజమణి, శ్రావణి, వార్డు సభ్యులు ఉన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్ సూచించారు. స్వచ్ఛ శుక్రవారంలో భాగంగా మండలంలోని వెన్నంపల్లిలో పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడారు. ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలనీ, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని వివరించారు. ఇక్కడ ఎంపీటీసీ సభ్యుడు జెట్టి దేవేందర్, డాక్టర్ మహేందర్‌కుమార్, హెచ్‌ఈఓ జెట్టి సుధాకర్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు , వార్డు సభ్యులు ఉన్నారు.
జూలపల్లి : మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించారు. చెత్తా చెదారం రోడ్లపై పడేయవద్దని పేర్కొన్నారు. ప్లాస్టిక్ నిర్మూలిం చాలని కో రారు. అబ్బాపూర్ శివారులో సర్పంచ్ వీర్ల మల్లేశం, మండల ప్రత్యేకాధికారి సుధాకర్ వానర వనంలో పండ్ల మొక్కలు నాటారు.

ఎలిగేడు(జూలపల్లి): ఎలిగేడు మండలంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాలు నిర్వహించారు. పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు సేకరించారు. గ్రామాల్లో చెత్తా, చెదారం శుభ్రం చేసి అవగాహన కల్పించారు. ఇంటింటా సర్వే చేసి పంచ సూత్రాల అమలు తీరు ను పరిశీలించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు వినియోగించు కోవాలని కోరారు. పరిసరాలు, ఆవాసాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండ్లు, నీడనిచ్చే మొక్కల పెంపకంపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
సుల్తానాబాద్ రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ సర్పంచులు కోలిపాక అరుణజ్యోతి, ఏరుకొండ రమేశ్‌గౌడ్,బాపన్న,ఉపసర్పచులు పసుల నిర్మల,ఏరుకొండ అరుణ,నాయకులు కోలిపాక పెదన్న, రాజారాం తదితరులు ఉన్నారు.
పెద్దపల్లిటౌన్: పెద్దపల్లి ప్రభుత్వ దవాఖాన పరిసరాల్లో ట్రినిటీ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మందల వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులకు సరైన వైద్య సేవలు అందించి వారితో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో దవాఖాన వైద్యులు, సిబ్బంది, ట్రినిటీ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు తదితరులున్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...