అన్ని రూట్లలో ఆర్టీసీ


Fri,November 8, 2019 03:47 AM

-గురువారం రోడ్డెక్కిన 288బస్సులు
-నాలుగు డిపోల నుంచి రాకపోకలు
-సాఫీగా సాగుతున్న ప్రయాణాలు
నల్లగొండసిటీ : ఆర్టీసీ బస్సుల ప్రయాణం జిల్లాలో నిరాటంకంగా సాగుతోంది. ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఆర్టీసీ అధికారులు వివిధ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. గురువారం జిల్లాలోని 4 డిపోల పరిధిలో 288 బస్సులు నడిపించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. తాత్కాలిక సిబ్బది సాయంతో ఉదయం 4 గంటల నుంచి రాత్రి వరకు బస్సులు నడిపిస్తున్నారు. ప్రతీ బస్సులో టిమ్స్ సాయంతో టిక్కెట్లు ఇస్తుండడంతో అధిక చార్జీల వసూలుకు అవకాశం లేకుండా పోయింది. నల్లగొండ, మిర్యాలగూడ బస్టాండ్లలో నాన్‌స్టాప్ బస్సులకు సైతం టిక్కెట్లు అందిస్తున్నారు. జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో ఉన్న బస్టాండ్లలో పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. ఆర్టీసీ కార్మికులు బస్సులు అడ్డుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని బస్టాండ్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...