మద్దతు ధర కోసం రోడ్డెక్కిన అన్నదాత


Fri,November 8, 2019 03:46 AM

వేములపల్లి : రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. అయినా కొందరు మిల్లర్లు సిండికేటుగా మారి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం మండలంలోని శెట్టిపాలెం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. శెట్టిపాలెం గ్రామ శివారులో నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై రైస్ మిల్లుల ఎదుట ధాన్యం ట్రాక్టర్లతో రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై అడ్డంగా కూర్చొని రెండు గంటలకు పైగా నిరసన తెలిపారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ బుధవారం వరకు సన్నరకం ధాన్యాన్ని రూ. 1850 వరకు కొనుగోలు చేయగా గురువారం మిల్లర్లు సిండికేట్‌గా మారి రూ. 1700లకు కొనుగోలు చేస్తున్నారని, అందుకే గత్యంతరం లేక తాము రోడ్డెక్కామని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించాలని చెబుతున్నా మిల్లర్లు ఖాతరు చేయడం లేదని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, వేములపల్లి ఎస్‌ఐ సుధీర్‌కుమార్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. మద్దతు ధర చెల్లించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...