యాదవుల ఆరాధ్యుడు సీఎం కేసీఆర్


Thu,November 7, 2019 01:10 AM

-రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య,
- నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య
- హాలియాలో ఘనంగా సదర్ సమ్మేళనం
- ఆకట్టుకున్న దున్నపోతుల ప్రదర్శన
- భారీగా హాజరైన యాదవులు

హాలియా, నమస్తే తెలంగాణ : యాదవుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్ అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. బుధవారం హాలియాలోని లక్ష్మీనర్సింహాగార్డెన్స్‌లో యాదవ సం ఘం, యాదవ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాదవులను ఇంతవరకు ఏ పార్టీ పెద్దల సభకు పంపలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే ప్రాధాన్యం కల్పించారని గుర్తు చేశారు. ఐదు ఎమ్మెల్యే స్థానాలు, మంత్రి వర్గంలో చోటు కల్పించి యాదవుల పాలిట దేవుడిలా నిలిచాడన్నారు. యాదవుల సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలన్నారు. సాగర్ నియోజకవర్గంలో డీఆర్డీఓను రూ.1000కోట్లతో ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే నోముల కృషి చేస్తున్నారన్నారు. ఎడమ కాల్వపై మొదటి మేజర్ చివరి భూములకు మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో సాగునీరు అందించిన ఘనత నర్సింహయ్యకే దక్కుతుందన్నారు. యాదవ భవనం అభివృద్ధికి తన నిధుల నుంచి రూ.10లక్షలు కేటాయిస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డాడని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మాట్లాడుతూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాదవులు లేని గ్రామం లేదన్నారు.

యాదవులు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని సూచించారు. యాదవులు మాట తప్పరు మడిమ తిప్పరని, మాటకు, నిజాయితీకి మారుపేరని సీఎం కేసీఆరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 18వేల సబ్సిడీ గొర్రెల యూనిట్లు అందించామని, నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అనంతరం యాదవ ప్రజాప్రతినిధులందరినీ పూలమాలలు, శాలువా, మెమొంటోలతో సన్మానించారు. వేడుకల్లో భాగంగా దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ రామ్మూర్తియాదవ్‌కు నివాళులర్పించారు.

ఎమ్మెల్యే నోముల తనయుడు, టీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకుడు నోముల భగత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెల కాపరుల ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ పోచబోయిన ఈశ్వరమ్మ, ఎడ్ల హరిబాబు, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్, నోముల గాయత్రి, గోపాల కృష్ణ, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, ఆంగోతు భగవాన్‌నాయక్, యాదవ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు జవ్వాజి వెంకటేశం, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, ఎంపీపీ బొల్లం జయమ్మ నాయకులు ఆవుల పురుషోత్తం, కూరాకుల అంతయ్యయాదవ్, అల్లి పెద్దిరాజు, రంజిత్‌యాదవ్, కర్ణ బ్రహ్మానందరెడ్డి, చల్లా మట్టారెడ్డి, చెరుపల్లి ముత్యాలు, నల్లబోతు వెంకటయ్య, వర్ర వెంకట్‌రెడ్డి, మాధవరం నరేందర్‌రావు, కొమ్మనబోయిన చంద్రశేఖర్‌గౌడ్, సురభి రాంబాబు, కట్టెబోయిన గోవర్ధన్, కిలారి కృష్ణ, చేగొండి కృష్ణ, పంగ లక్ష్మణ్, రామాంజనేయులు, పిల్లి అభినయ్‌యాదవ్, ఎనమల సత్యం, జానపాటి శ్రీను పాల్గొన్నారు.

యాదవుల భారీ ర్యాలీ..
సదర్ వేడుకను పురస్కరించుకొని ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతోపాటు తనయుడు నోముల భగత్, యాదవ సంఘం నాయకులతో కలిసి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గజ్జల లాగు సవ్వళ్లు, భేరీ చప్పుళ్లతో సంప్రదాయ నృత్యాలతో నడుమ సదర్ దున్నపోతులతో ఊరేగింపుగా స్థానిక లక్ష్మీనర్సింహ గార్డెన్స్‌కు చేరుకున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...