రైతులు మద్దతు ధర పొందాలి


Thu,November 7, 2019 01:09 AM

కేతేపల్లి : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. మండలంలోని బొప్పారం, ఇప్పలగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల్లో ఐకేసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దనే ధ్యేయంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీడీఓ హరికృష్ణ, సర్పంచులు కర్ర ప్రభాకర్‌రెడ్డి, దేవరకొండ వీరయ్య, కట్ట శ్రవణ్, బచ్చు జానకిరాములు, ఎంపీటీసీలు ఎడ్ల ప్రవీణ్‌కుమార్, గాజుల ప్రమీల, ఐకేపీ ఏపీఎం యాదమ్మ, సిబ్బంది శాంత, నాయకులు కె.ప్రదీప్‌రెడ్డి, ప్రభాకర్ రైతులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...