మద్దతు ధరకు టాస్క్‌ఫోర్స్ బృందాలు


Thu,November 7, 2019 01:08 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించాలని ఇన్‌చార్జి కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ రంగనాథ్‌లో కలిసి మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, పోలీస్, పౌర సరఫరాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, సహకార, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కన్నా తక్కువ చెల్లిస్తే చర్యలు తీసుకుంటామని...ఇందుకు గాను తనిఖీల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మద్దతు ధర చెల్లింపులో మిల్లర్ల మధ్య తేడాలు రావొద్దని ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి రూ.1835 చెల్లిస్తున్నట్లు తెలిపారు. మిల్లర్లు మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దీనిపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటామన్నారు.

ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ మద్దతు ధర కంటే తక్కువ చెల్లిస్తే కలెక్టర్, ఎస్పీ ఇతర శాఖల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తూకం విషయంలోనూ తేడాలు ఉన్నా ఫిర్యాదు చేయవచ్చన్నారు. పక్క రాష్ర్టాల నుంచి వచ్చే ధాన్యం అరికట్టడానికి చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేస్తామని తెలిపారు. రైస్‌మిల్లర్లసంఘం అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ అన్ని మిల్లుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీఓ శ్రీనివాసమూర్తి, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, డీఎస్‌ఓ రుక్మిణిదేవి, సివిల్ సప్లయ్ డీఎం నాగేశ్వర్‌రావు, ఏడీఏ హుస్సేన్‌బాబు, లేబర్ కమిషనర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...