మద్దతు ధర చెల్లించకుంటే చర్యలు


Thu,November 7, 2019 01:08 AM

నల్లగొండసిటీ: జిల్లాలో రైతులు మా ర్కెట్, రైస్ మిల్లులకు తీసుకొచ్చే ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రంగనాథ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం అధికంగా మిల్లర్ల వద్దకు రైతులు తీసుకొస్తారని రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ. 1835 చెల్లించాలన్నారు. ఎంఎస్‌పీ కన్నా ఎక్కడైనా తక్కువ చెల్లించినట్లయితే రైతులు ఇన్‌చార్జి కలెక్టర్ చంద్రశేఖర్ 9440912000 లేదా ఎస్పీ 9440795600 నేరుగా ఫొటోలు, వీడియోలు, మిలర్లతో జరిగిన సంభాషణ రికార్డులు పంపాలన్నారు. రైతుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీస్, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ, తూనికల కొలతల శాఖ అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్ అక్కడకు చేరుకుని రైతులకు మద్దతు ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకుని న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్ధ్దేశించిన విధంగా ధాన్యం ఉండి మిల్లర్లు కనీస మద్దతు ధర చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు నిర్ధారణ అయితే మిల్లర్లపై కేసు నమోదుచేయడంతో పాటు ఆ మిల్లును టాస్క్‌ఫోర్స్ టీమ్ సీజ్ చేయ డం జరుగుతుందన్నారు. రైతులు పంపే సమాచారం, ఫొటోలు ఇతర అన్ని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

జిల్లాలో అన్ని వే బ్రిడ్జిలు తనిఖీ ...
జిల్లాలో రైతాంగం ధాన్యం మార్కెట్లకు, రైస్ మిల్లులకు తీసుకొస్తున్న క్రమంలో జి ల్లాలోని వేబ్రిడ్జిలు, రైస్ మిల్లుల్లోని కాంటాలను తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యం లో కలిసి తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడైన తూకంలో తేడా వచ్చినా రైతులు నిర్ధారిస్తే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుని సీజ్ చేస్తామన్నారు.

సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పటిష్టం...
జిల్లాలోని సాగర్, వాడపల్లి సరిహద్దు రాష్ర్టాల చెక్‌పోస్టులను మరింత పటిష్టం చేయడం ద్వారా పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం మన రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ధాన్యం అధికంగా పండిన నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...