యథావిధిగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులు


Tue,November 5, 2019 01:00 AM

నల్లగొండసిటీ : కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ ఆర్టీసీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లాలోని మూడు డిపోల నుంచి లక్ష్యానికి మించి బస్సులు నడిచాయి. దేవరకొండ డిపోలో డ్రైవర్ గుండెపోతుతో మృతి చెందడంతో సంతాపంగా బస్సులు నిలిచిపోయినప్పటికి నల్లగొండ, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి డిపోల నుంచి సోమవారం ఒక్కరోజే 220 బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపారు. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు నడుస్తుంటంతో పాఠశాలల సమయాల్లో ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు. దీంతో విద్యార్థులకు ఆటంకం లేకుండా విద్యాలయాలకు వెళ్తున్నారు. జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం కనిపించడం లేదు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...