చెర్వుగట్టులో భక్త జన సందోహం


Tue,November 5, 2019 12:59 AM

నార్కట్‌పల్లి : కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల రాకతో మండలంలోని శివాలయాలు సందడిగా మారాయి. మండల పరిధిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువ జామునుంచే భక్తులు భారీగా తరలిరావడంతో గట్టుపై భక్తజన సందోహం నెలకొంది సూర్యోదయానికి ముందే భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నా నం ఆచరించి ఉసిరి చెట్టుకు పూజలు చేసి లక్ష ఒత్తులతో కార్తీక దీపాలను వెలిగించారు. ఓం శివా నమః శివాయ.. హరహర మహాదేవ శంభో శంక రా.. అంటూ భక్తులు నామ స్మరణలతో చెర్వగట్టు మార్మోగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయం సిబ్బంది స్వామివారి మహామండపంతో పాటు మరో చోట సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేయించేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో భక్తులు వ్రతాలు ఆచరించారు. ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి దంపతులు చెరువుగట్టు క్షేత్రాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ సులోచన భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించారు చేశారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...