చలి షురూ...


Mon,November 4, 2019 02:04 AM

-తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
-చలిగాలులకు వణుకుతున్న ప్రజలు
-జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన

నీలగిరి : చలి రోజురోజుకు పుంజుకుంటోంది. కనిష్ట ఉష్ణోగ్రతలో మార్పులు లేకున్నా గరిష్ట ఉష్ణోగ్రతలు వారంరోజులుగా తగ్గుతూ వస్తుండడంతో చలితో అప్పుడే ప్రజలు వణికిపోతున్నారు. తెల్లవారుజామున మంచుతోపాటు చల్లటి గాలుపు వీస్తుండటంతో చలి తీవ్రత సూర్యుడు ఉదయించిన్నప్పటీ వణికిస్తుంది. ఉదయం 9గంటల నుంచి భానుడి వేడి పెరిగి వెచ్చదనన్ని వెదజల్లుతున్నప్పటీకీ పగటి వేళలో ఎండ ఉన్నప్పటీకీ కాస్తా చలిగానే ఉంటుంది. సాయంత్రం 5గంటలు అవుతుండగానే చలి మొదలవుతోంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు చల్లని గాలినుంచి ఉపశమనం పొందడంతోపాటు చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకుకోవడానికి మార్కెట్ వైపు పరుగులు తీస్తున్నారు. వెచ్చదనం ఇచ్చే స్వెట్టర్లు, కోట్లు, కోల్డ్ క్రీములు కొనుగోలు చేసేందుకు సిద్ధమౌతున్నారు.

చలికాలం ప్రారంభంకావడంతో మార్కెట్‌లోకి చలికాలంలో ఉపయోగించే స్వెట్టర్లు, చలి కోట్లు, క్రిమ్స్, సోప్స్ విక్రయాలు అందుబాటులోకి రావడంతో జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిలో భాగంగా నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్ సమీపంలో ఐబీ కార్యాలయం, ఎస్పీటీ మార్కెట్‌కు వెళ్లే దారిలో ఫుట్‌పాత్‌లపై రాజస్థాన్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సిన వస్తువులు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా పట్టణంలోని పలు ప్రాంతాలలోని దుకాణాలలో కూడా శీతాకాలంలో ఉపయోగించే సోలన్స్, వస్తువుల విక్రయించేందుకు అందుబాటులో ఉంచడంతో వాటిపి కొనుగోలు చేస్తుండటంతో శీతాకాలంలో ఉపయోగించే వస్తువులకు గిరాకీ మొదలైంది.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...