అన్ని రూట్లకు నడుస్తున్న ఆర్టీసీ బస్సుల


Mon,November 4, 2019 02:03 AM

నల్లగొండ సిటీ : పల్లెలకు కూడా ఆర్టీసీ బస్సులు పరగులు పెడుతున్నాయి. కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదికారులు సమిష్టిగా చేపడుతున్న ప్రత్యామ్నయ ఏర్పాట్లతో ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. జిల్లాలోని 4డిపోల పరిధిలో 292 బస్సులు నడిచాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా బస్సులను నడుపుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోవడం లేదు. జిల్లాలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. అన్ని రూట్లలో బస్సులను నడిపి ప్రయాణికుల ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో అధికారులు చేపట్టిన ప్రత్యామ్నయ ఏర్పాట్లు సత్ఫలితాన్నిస్తున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమాయానుసారంగా బస్సులు నడుస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే బస్సులు నడుస్తునాయనీ ప్రయాణికులు అంటున్నారు. జిల్లాలోని నల్గొండ డిపోతో పాటు, మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్‌పల్లి డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. హైద్రాబాద్‌కు ఆర్టీసీ సూపర్ లగ్జర్‌తో పాటు డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రతి పదినిమిషాలకోటి బయలుదేరుతుండటంతో ప్రయాణికులు సాఫీగా ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 30 రోజులకు చేరుకున్నప్పటికీ జిల్లాలో ఎక్కడ కూడా సమ్మె ప్రభావం కనిపించడం లేదు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...