వైద్యరంగం మరింత అభివృద్ధి చెందాలి


Mon,November 4, 2019 02:02 AM

-శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ కల్చరల్ : వైద్యరంగం మరింత అభివృద్ధి చెంది మెరుగైన వైద్యసేవలు అందించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నూతనంగా నిర్మించిన రివర్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల నరసింహాయ్యలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పేదలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్యసేవలు, పరీక్షలు అందిస్తూ వారికి ఫీజులు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ఆసుపత్రి నిర్వహకులు వెంకట్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి, పృద్వీరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నిఖిల్‌రెడ్డి, డాక్టర్ పుల్లారావు, అనితారాణి, వసంతకుమారి పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...