మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి


Mon,November 4, 2019 02:02 AM

నీలగిరి: మున్సిపాలిటిల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కోరారు. ఆదివారం పట్టణంలోని దొడ్డి రొమరయ్య భవన్‌లో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా మహాసభ జక్కల రవికుమార్, నోముల మరియమ్మ అధ్యక్షతన జరిగింది. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సభలో జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు ఎండీ సలీం, సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, నాయకులు అద్దంకి నర్సింహ్మ, ఏ.శ్రీను, వెంకన్న, సైదులు, సంతోష్, రమేష్, సంజీవ ఉన్నారు.

నూతన కమిటీ.. : మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా తుమ్మల వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జక్కల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిలుముల వెంకన్న, కోశాధికారిగా గుండమల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సంతోష్, అన్నిపాక శ్రీనివాస్, శేఖర్, దుర్గయ్య, సహాయకార్యదర్శిగా అంజమ్మ, సైదులు, అండాలు, ఎల్లమ్మ మరో 26మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...